A Live Journal on Telugu Land

Literature | Songs | Aakasam Enatido Anuragam Aanatidi (Nireekshana)

Music: Ilayaraja     Lyrics: Aathreya

ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది ||ఆకాశం ఏనాటిదో||

ఏ పువ్వు ఏ తేటిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవి చూడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను || ఆకాశం ఏనాటిదో ||

ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు || ఆకాశం ఏనాటిదో ||

Audio: