A Live Journal on Telugu Land

Literature | Songs | Priya Priyathama Raagaalu (Killer)

Music: Ilayaraja     Lyrics: Veturi

ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే... నాలో రేగే || ప్రియా||

జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు
ఎవరులేని మనసులో ఎదురురావే నా చెలీ
అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలీ
ఒకే వసంతం కూహు నీ నాదం నీలో నాలో పలికే || ప్రియా||

శరత్తులోనా వెన్నెలా తల్లెత్తుకుంది కన్నులా
షికారుచేసే కోకిలా పుకారువెసే కాకిలా
ఎవరు ఎంత వగచినా చిగురువేసే కోరికా
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారకా
మదే ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే || ప్రియా||

Audio: